రేవంత్ సంచలనం.. దాని కోసం కొత్త పాలసీ?

Chakravarthi Kalyan
తెలంగాణ రాష్ట్రంలో ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీ తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తమిళనాడు, కర్ణాటక, ఏపీ తదితర రాష్ట్రాల విధానాలు అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం జారీ చేశారు. ఇప్పుడున్న ఇసుక పాలసీ అవినీతి దందాగా మారిందన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇసుక తవ్వకాలు, రవాణాలో అడుగడుగునా అక్రమాలు జరుగుతున్నాయన్నారు. సుమారు 25 శాతం ఇసుక అక్రమంగా తరలిపోతోందని.. నిబంధనలను ఉల్లంఘించి జరుగుతున్న ఇసుక క్వారీయింగ్ అరికట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

అక్రమ ఇసుక రవాణాను వెంటనే అరికట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలిచ్చారు. 48 గంటల్లో అధికారులు తమ పద్ధతి మార్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక జారీ చేశారు. రెండు రోజుల తర్వాత విజిలెన్స్, ఏసీబీ విభాగాలను రంగంలోకి దింపాలని అధికారులకు సీఎం ఆదేశించారు. అన్ని జిల్లాల్లో తనిఖీలు చేసి  బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: