బిగ్‌షాక్‌.. మేడిగడ్డ పూర్తిగా కూలిపోతుందా?

Chakravarthi Kalyan
కేసీఆర్ సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని విజిలెన్స్ నివేదిక చెబుతోంది. ఈ విషయాన్ని నీటి పారుదల మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తెలిపారు. అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు కూడా ప్రమాదంలో ఉన్నాయన్న మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి.. మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగుబాటుపై కేసీఆర్ ఎందుకు నోరెత్తటం లేదన్నారు.


కృష్ణా ప్రాజెక్టులపై మేం ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి.. కేసీఆర్, జగన్ కలిసి తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. కృష్ణా నదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టులు కట్టి నీరు తరలించిందన్న మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి.. ఏపీ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులకు కేసీఆర్‌ అడ్డు చెప్పలేదన్నారు. మన నీళ్లు ఏపీకి వెళ్తుంటే కేసీఆర్ నిశ్శబ్దంగా ఉన్నారని.. ఆంధ్రకు 8 రెట్లు ఎక్కువ నీళ్లు వెళ్తే కేసీఆర్ స్పందించలేదని.. గోదావరిలో 2 టీఎంసీల నీటి కోసం లక్షల కోట్లు వృథా చేశారని.. కేసీఆర్‌ లక్ష కోట్ల దోచుకుని కూలుతున్న కాళేశ్వరం కట్టారని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఆరోపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: