సర్పంచ్‌ ఎన్నికలు.. రేవంత్‌ ఎందుకు జరపట్లేదు?

Chakravarthi Kalyan
తెలంగాణలో సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసింది. అయినా రాష్ర్ట ప్రభుత్వం సర్పంచ్‌ ఎన్నికలు జరపట్లేదు. దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. సర్పంచ్‌ల పదవి కాలం ముగిసిపోయినప్పటికీ.. ఇప్పటి వరకు వాళ్ల ఖర్చుచేసిన బిల్లులు రాలేదని విపక్షాలు ఆవేదన వ్యక్తం చేశాయి. రాష్ర్ట ప్రభుత్వం తక్షణమే సర్పంచ్ ల బిల్లులు చెల్లించాలని విపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. భారాస మీద ఉన్న వ్యతిరేకతతోనే కాంగ్రెస్‌ పార్టీ గెలిచిందంటున్న విపక్ష నేతలు కాంగ్రెస్‌ పార్టీకి ఆ విషయం తెలిసే సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించడం లేదని ఆరోపించారు.
17 ఎంపీలను గెలిపిస్తేనే ఆరు గ్యారంటీలు అమలవుతాయని కాంగ్రెస్‌ ప్రభుత్వం చెబుతుందని.. అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చి పార్లమెంట్‌ ఎన్నికలకు ముడి పెట్టడం ఏంటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో  17 ఎంపీ సీట్లు గెలిస్తే కేంద్రంలో అధికారంలోకి ఎట్లా వస్తారని ప్రశ్నిస్తున్నారు.  రాహుల్‌ గాంధీని సంతృప్తి పరచడానికే ప్రధాని అవుతారని చెబుతున్నారని.. దమ్ముంటే ప్రధానిగా ముందు ప్రకటించాలని వారు డిమాండ్‌ చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: