చిలకలూరిపేట అభ్యర్థి ఎవరో ప్రకటించిన విజయసాయి?

Chakravarthi Kalyan
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చిలకలూరి పేట నుంచి వైసీపీ తరపున మల్లెల రాజేశ్‌ నాయుడు పోటీ చేస్తారని వైసీపీ నేత విజయసాయి రెడ్డి తెలిపారు. ఇక్కడ రాజేష్ నాయుడును గెలిపించాలని వైసీపీ నేత విజయసాయి రెడ్డి కోరారు. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ ఏపీకి చేసిన ద్రోహానికి ఆమెను ఎవరు క్షమించరని విజయ సాయిరెడ్డి అన్నారు. రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని తరతరాలు గుర్తుపెట్టుకుంటారని వైసీపీ నేత విజయసాయి రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రపుటల్లో కలిసిపోయిందన్న వైసీపీ నేత విజయసాయి రెడ్డి.. జగన్‌తోనే రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధ్యమైందని అన్నారు.

గత పాలనలో చంద్రబాబు వెనుకబడిన వర్గాలను పట్టించుకోలేదన్న వైసీపీ నేత విజయసాయి రెడ్డి... చంద్రబాబు దళితులను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారన్నారు. సామాజిక సాధికార యాత్ర దేశంలోనే ఎవరూ చేయని ఓ అద్భుతమైన కార్యక్రమమన్న వైసీపీ నేత విజయసాయి రెడ్డి.. వచ్చే ఎన్నికలు ధనికులకు.. పేదవారికి మధ్య జరిగే ఓ రెఫరండమని అన్నారు. ఈ యుద్ధంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు పేదవారి పక్కన వైఎస్ జగన్‌ నిలబడి వారిని గెలిపిస్తారని వైసీపీ నేత విజయసాయి రెడ్డి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: