అయోధ్యకు అందుకే అద్వానీని రానివ్వలేదా?

Chakravarthi Kalyan
అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ఠకు అద్వానీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానించకపోవడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు గుప్పించారు. ఎక్కడ ఎల్ కే పేరు అద్వానీకి వెళ్తుందోనని బీజేపీపార్టీ అగ్ర నాయకులు భావించారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. బీహార్ లో ఇండియా కూటమికి వ్యతిరేఖంగా నితీష్ కుమార్ రాజకీయాలు చేస్తున్నారన్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. ఇండియా కూటమికి వ్యతిరేకంగా బీజేపీ కుట్రలు పన్నుతుందన్నారు. ఇండియా కూటమిలో ఉన్న పార్టీలను ఆ పార్టీ భయపెడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు.

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఐకి కూడా అవకాశం ఇవ్వాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ..  కాంగ్రెస్ పార్టీకీ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నుంచి పార్లమెంట్ లో కమ్యూనిష్టు నాయకులు ఉండాలన్న నారాయణ... గడిచిన పదేళ్లలో బీజేపీ జనగణన చేపట్టలేదని, పబ్లిక్ సెక్టార్లను ప్రైవేట్ పరం చేశారని ధ్వజమెత్తారు. మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లను రాబట్టాలని బీజేపీ ప్రయత్నిస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ  అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: