రేటింగ్‌ ఇస్తే చాలు.. డబ్బులు వచ్చేస్తాయి?

Chakravarthi Kalyan
వాట్సాప్, టెలిగ్రామ్ ఆన్‌లైన్‌లో తమ ఉత్పత్తులకు సంబంధించి ఎక్కువ రేటింగ్ ఇస్తే చాలు.. మీ ఖాతాలో డబ్బు వేస్తామంటూ కొందరు సైబర్ నేరగాళ్లు టోపీ పెడుతున్నారు. ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఆంధ్రప్రదేశ్ చెందిన నేష్నోర్ శిరీష్ కుమార్ అనే వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. అలాగే ఇన్సూరెన్స్ పేరుతో మోసాలను చేస్తున్న ఇద్దరి నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాట్సాప్, టెలిగ్రామ్ ఆన్‌లైన్‌లో తమ ఉత్పత్తులకు సంబంధించి ఎక్కువ రేటింగ్ తోపాటు వివిధ సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇస్తామని వీరు చెబుతారు.

భాదితుల నుంచి నగదు వసూలు చేస్తున్నారు. ఓ ఫిర్యాదుదారడి సమాచారం ఆధారంగా వీరిని పట్టుకున్నారు. విచారణ అనంతరం నిందితుడి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడికి చైనా సైబర్ నేరగాళ్లతో ఉన్న లింకులపైనా ఆరా తీస్తున్నారు.  భారత్ దేశానికి చెందిన కొన్ని బ్యాంక్ ఖాతాలు తెరిచి వాళ్లుకు ఇచ్చారని దర్యాప్తులో వెల్లడింది. నిందితుడు చైనా వారితో కలిసి సైబర్ మోసాలు చేస్తున్నట్ల పోలీసులు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: