ఎన్నికల ఎఫెక్ట్‌.. అధికారులకు షాకులు?

Chakravarthi Kalyan
ఎన్నికలతో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బంది బదిలీలను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒకే చోట మూడేళ్ల సర్వీసు దాటిన ఉద్యోగులు, అధికారులను బదిలీ చేస్తున్నారు. ఈసీ సూచనల మేరకు నిబంధనలకు అనుగుణంగా బదిలీలు చేపట్టినట్టు సర్కారు వెల్లడించింది. సొంత జిల్లాలో పనిచేస్తున్న, ఒకే చోట మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి, జూన్ 30 తేదీతో మూడేళ్లు పూర్తి అవుతున్న వారిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఎన్నికల విధుల్లో అక్రమాలపై క్రమశిక్షణా చర్యలు పెండింగ్ లో లేని అధికారులు, ఎలాంటి క్రిమినల్ కేసులు లేని వారు ఆరు నెలల్లో ఉద్యోగ విరమణ చేయని అధికారులను పరిగణనలోకి తీసుకోవాలని ఈసీ సూచించింది. ఒకే జిల్లాలో పదోన్నతి పొందినా అంతకుముందు సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్టు ఉత్తర్వుల్లో ఈసీ వెల్లడించింది. మున్సిపల్ శాఖలో 92 మందిని బదిలీ చేస్తూ ఆ శాఖ ప్రత్యేకప్రధాన కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. ఎక్సైజు శాఖలోనూ భారీ సంఖ్యలో బదిలీలు చేస్తూ ఆదేశాలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: