షాకింగ్‌: జగన్‌ నోట.. ఓటమి మాట?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్‌ నోట ఓటమి మాట వినిపించింది. తిరుపతిలో ఇండియా టుడే నిర్వహించిన ఎడ్యుకేషన్ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న సీఎం జగన్‌.. రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏపీలో కాంగ్రెస్‌ డర్టీ పాలిటిక్స్‌ చేస్తోందన్న సీఎం జగన్.. కాంగ్రెస్‌ రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్రాన్ని విడదీసిందని.. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్‌ ఇప్పుడు మా కుటుంబాన్ని విడదీస్తోందని అన్నారు.
గతంలో మా బాబాయిని మాపై కాంగ్రెస్‌ ప్రయోగించిందని గుర్తు చేసిన సీఎం జగన్.. విభజించి పాలించడమే కాంగ్రెస్‌ విధానమని.. కాంగ్రెస్‌ గతం నుంచి పాఠాలు నేర్చుకోలేదని.. కాంగ్రెస్‌ మళ్లీ మా కుటుంబాన్ని విడదీసే ప్రయత్నం చేస్తోందని.. నా సోదరిని అధ్యక్షురాలిగా చేసి కాంగ్రెస్‌ నాపై ప్రయోగిస్తోందని అన్నారు. కాంగ్రెస్‌కు మరోసారి దేవుడు గుణపాఠం చెబుతాడన్న సీఎం జగన్.. ఇప్పటికిప్పుడు నేను పదవి నుంచి దిగిపోయినా బాధపడనని చెప్పారు. కోట్ల మంది జీవితాల్లో సంతోషం నింపానని.. ఇప్పటికిప్పుడు పదవి నుంచి దిగిపోయినా సంతోషంగానే ఉంటానని సీఎం జగన్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: