కాంగ్రెస్‌ పేరిట ఘరానా మోసం.. మీరూ జాగ్రత్త?

Chakravarthi Kalyan
కాంగ్రెస్ పేరుతో విరాళాలు సేకరిస్తూ ఓ ఘరానా మోసం జరిగింది. క్రౌడ్ ఫండింగ్ వెబ్సైట్ కేసులో నిందితుడిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పేరుతో నకిలీ వెబ్సైట్ తయారు చేసిన రాజస్థాన్ జైపూర్ కి చెందిన సురేంద్ర చౌదరి.. ఆ నకిలి వెబ్సైట్ క్రియేట్ చేసిన ప్రజలను మోసం చేశాడు. అది నిజమైన కాంగ్రెస్ వెబ్‌ సైటే అనుకున్న కొందరు ఆ పార్టీకి విరాళాలు పంపారు. నకిలీ వెబ్సైట్ లో విరాళాలు చెల్లించిన కొందరు ఆ తర్వాత తప్పు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ అంశంపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. అసలు వెబ్ సైట్ తయారు చేసిందెవరంటూ కూపీ లాగారు. ఇలాంటి సైబర్ నేరాలకు ఉత్తరాది రాష్ట్రాలు ఇటీవల కేరాఫ్‌ అడ్రస్‌గా మారాయి. చివరకు నిందితుడు రాజస్థాన్ వాసిగా గుర్తించిన సురేంద్ర చౌదరిని.. రాజస్థాన్ వెళ్ళి నిందితుడు సురేంద్ర చౌదరిని అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: