వైసిపి స్కెచ్.. ఏకంగా 15 లక్షల మంది సైన్యం..!

Divya
వైసిపి పార్టీ టోటల్గా కమిటీల నిర్మాణానికి సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. వైసిపి రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించగా.. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అన్ని నియోజకవర్గాల పైన ఫోకస్ చేయాలని,పార్టీ కార్యక్రమాలతో పాటుగా కమిటీ నిర్మాణం అనేది కూడా చాలా ప్రాధాన్యతమైనది అంటూ వైఎస్ జగన్ ప్రత్యేకించి తెలియజేశారని చెప్పారు. కమిటీలలో నియమకాలు కూడా నిర్మాణాత్మకంగానే జరగాలని, ఫిబ్రవరి మొదటి వారంలో కల్లా కమిటీల నియామకాలను పూర్తి చేయాలంటూ తెలియజేశారని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి.



డేటా ప్రొఫైల్ విషయంలో ఎలాంటి తప్పులు లేకుండా సరిగ్గా ఉండేలా చూసుకోవాలని, అలా ఉంటేనే భవిష్యత్తులో అనేక ఉపయోగాలు ఉంటాయని, వాటన్నిటిని పార్టీ కేంద్ర కార్యాలయంతో కూడా అనుసంధానం జరుగుతుందని తెలిపారు. సుమారుగా 15 లక్షల మంది వైసీపీ సైన్యం వివిధ కమిటీలలో భాగస్వామ్యులుగా ఉంటారని  తెలియజేశారు. ఇది వైసీపీ పార్టీకి కీలకమైనటువంటి అంశం అన్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి ప్రణాళికలను కూడా సిద్ధం చేశామని ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ సోల్జర్స్ ను తయారు చేసే కార్యక్రమంలో భాగమని తెలిపారు.


ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో నుంచి డిజిటల్ మేనేజర్లు కూడా అందుబాటులో ఉన్నారని, కమిటీ నియామకం పైన నాయకులకు అవసరమైన సలహాలు కూడా ఇస్తున్నామని తెలిపారు. కొన్ని ప్రాంతాలలో సైంటిఫిక్ గా కమిటీలను నియామకాలు పూర్తి అయ్యాయి. పుంగనూరు, వేమూరు, మడకశిర ఇలా కొన్ని నియోజకవర్గాలలో పైలెట్ ప్రాజెక్టుగా మైక్రో లెవెల్ లో అన్ని కమిటీలను పూర్తి చేశామని, ఈ కమిటీ నియామకం పైన పార్టీ సీనియర్లతో ఏర్పాటు చేశామని వారంతా కూడా అవసరమైన సమావేశాలు నిర్వహించుకొని, ఒక డ్రైవ్ లాగా వీటిని పూర్తి చేయాలని దిశానిర్దేశం ఇచ్చామంటూ తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ కమిటీ నియమకాలాన్ని పక్కాగా జరిగాయి అంటే ఏ ఎన్నికలు జరిగినా గెలవడానికి సులభతరంగా అవుతుందని, అలాగే పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా కూడా ఈ కమిటీల ద్వారానే విజయవంతం చేయవచ్చు అంటు తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: