కోడికత్తి శ్రీను ప్రాణాలకు ప్రమాదం వచ్చిందా?

Chakravarthi Kalyan
కోడి కత్తి శ్రీను ప్రాణాలకు ప్రమాదం వచ్చిందంటున్నారు ఆయన న్యాయవాది సలీం. జగన్ వచ్చి తన కేసులో సాక్ష్యం చెప్పాలని కోడి కత్తి శ్రీను, ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కోడి కత్తి శ్రీను జైల్లోనూ దీక్ష కొనసాగిస్తున్నాడట. ఈ రోజు న్యాయవాది సలీం టీమ్ మరియు దళిత సంఘాలు విశాఖ జైలులో కలిసారు. కోడి కత్తి శ్రీను చాలా నీరసంగా ఉన్నాడని.. ఇద్దరు వ్యక్తులు అతన్ని మోసుకొని తీసుకువచ్చారని... జైల్లో కోడి కత్తి శ్రీను అమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాడని వారు చెబుతున్నారు.

కోడి కత్తి శీను ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగా లేదని.. జైలు అధికారులు దీక్ష విరమించమని తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తున్నారని వారు తెలిపారు. ఇక్కడ ఏమైనా జరగవచ్చు నా ప్రాణాలకు ముప్పు ఉంది కాబట్టి నన్ను ఇక్కడ నుండి తరలించండని శ్రీను వేడుకుంటున్నాడట. కోడి కత్తి శ్రీను హెల్త్ బులెటిన్ విడుదల చెయ్యాలని ఆయన లాయర్ డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీ వారికి పిటిషన్ దాఖలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: