రేవంత్ సర్కారుకు థ్యాంక్స్‌ చెప్పిన బీజేపీ?

Chakravarthi Kalyan
మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం చెప్పిందని భాజపాని భారాస బదనాం చేసిందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కానీ.. కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ఈ విషయంపై నిజం చెప్పారని.. అందుకే ఆయనకు మా తరుపున ధన్యవాదాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టి డబ్బులు వసూలు చేయాలని చెప్పలేదని మంత్రి ఉత్తమ్‌ క్లారిటీ ఇచ్చారని.. ఇకనైనా భారాస నేతలకు సిగ్గు రావాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు.

శ్వేత పత్రాల్లో గత ప్రభుత్వం  చేసిన అప్పులపై స్పష్టత లేదన్న బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్.. లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎందుకు చర్చ జరపలేదన్నారు. గతంలో మా దగ్గర సాక్షాలు ఉన్నాయని చెప్పిన కాంగ్రెస్ నేతలు.. విచారణకు ఫిర్యాదు చేద్దామంటే సరైన సహకారం అందించడంలేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రశ్నించారు. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ వాళ్లదే కదా.. అయినా ఎందుకు చర్చ జరపలేదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP

సంబంధిత వార్తలు: