విత్తన సరఫరాలో తెలంగాణ రైతులకు ప్రాధాన్యత ఇచ్చి, మిగతా విత్తనాలను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసుకోవాలని కంపెనీలకు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచన చేశారు. విత్తన సరఫరాపై అధికారులు, కంపెనీల ప్రతినిధులు, శాస్త్రవేత్తలతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమీక్ష నిర్వహించారు. విత్తన సరఫరా, నాణ్యత, లభ్యతపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. రైతులకు విత్తన లభ్యతలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూడాలని అధికారులు, విత్తన కంపెనీలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
నకిలీ విత్తనాల లేకుండా చూడాలని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశాలిచ్చారు. నకిలీ విత్తనాల వల్ల రైతులకు నష్టం జరిగితే విత్తన కంపెనీలు నష్ట పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. తెలంగాణ విత్తన రంగ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు.