ఆమెకు జెడ్పీ ఛైర్మన్ ఇవ్వాల్సిందే.. ఆర్‌ఎస్‌పీ డిమాండ్?
తెలంగాణ పంచాయితీ రాజ్ చట్టం - 2018 ప్రకారం ఏజెన్సీ ఏరియాలోని ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ పదవికి ఎస్టీ (మహిళ)కు రిజర్వ్ చేయబడిందని.. ఆ స్థానంలో జనరల్ కేటగిరీకి చెందిన వైస్ ఛైర్మన్ కోనేరు కృష్ణారావును తాత్కాలికంగా ఛైర్మన్‌గా ఎంపిక చేయడం రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకమని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రాజ్యాంగం ప్రకారం ఆదివాసీ, గిరిజన మహిళలకు కేటాయించిన స్థానాన్ని ఆధిపత్య వర్గాలు తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆర్‌ఎస్‌పీ ఫిర్యాదులో ప్రస్తావించారు.