దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే@30 ఏళ్లు: షారుక్ -కాజోల్ క్రియేట్ చేసిన రికార్డ్స్ ఇవే..!
డైరెక్టర్ ఆదిత్య చోప్రా ఈ చిత్రం కథని 4 వారాలలోనే పూర్తి చేశారు. ఆదిత్య చోప్రాకు మొదటి చిత్రం కూడా ఇదే.1995 అక్టోబర్ 20న ఈ సినిమా విడుదలయ్యింది.
మొదట ఈ సినిమాలో నటించేందుకు హాలీవుడ్ ప్రముఖ నటుడు టామ్ క్రూజ్ ను హీరోగా తీసుకోవాలనుకున్నప్పటికీ ,ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ ని కూడా ఎంపిక చేసుకున్న వర్కౌట్ కాలేదట డైరెక్టర్ కి.
ఈ సినిమాలో నటించడానికి ముందు షారుక్ ఖాన్ కూడా సందేహబడ్డారు .అప్పటివరకు ఎక్కువగా విలన్ పాత్రలలో నటించిన షారుక్ ఈ చిత్రంలో రొమాంటిక్ హీరోగా ఆకట్టుకోలేనేమో అనుకున్న డైరెక్టర్ ఆదిత్య పైన ఉండే నమ్మకంతో ఒప్పుకున్నారు.
ఈ సినిమా టైటిల్ ని అనుపమ్ ఖేర్ భార్య(కిరణ్ ఖేర్ )దర్శక నిర్మాతలకు సూచించింది.
దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే సినిమా మేకింగ్ వీడియోని అప్పట్లో దూరదర్శన్ లో ప్రసారం చేశారు. మొట్టమొదటి మేకింగ్ వీడియో ఇలా చూపించిన చిత్రంగా రేర్ రికార్డు సృష్టించింది.
ఇండియన్ సినీ పరిశ్రమలో అత్యధిక రోజులపాటు థియేటర్లో ప్రదర్శించిన సినిమాగా సరి కొత్త రికార్డు సృష్టించింది. ముంబైలోని మరాఠా మందిర్లో 27(మధ్యలో గ్యాప్ ఇస్తూ) ఏళ్ల పాటు ప్రదర్శించారు.
రూ .4కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించగా రూ .100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అలాగే బెస్ట్ పాపులర్ ఫిలిం ప్రోవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ విభాగంలో జాతీయ అవార్డు కూడా అందుకుంది.
అమెరికన్ ప్రొడ్యూసర్, క్రిటిక్ స్టీవెన్ రాసినటువంటి బుక్కులో కూడా ఈ సినిమా చోటు సంపాదించుకుంది.
ఈ చిత్రంలో షారుక్ ఖాన్ ధరించిన లెదర్ జాకెట్ ను అమెరికా నుంచి తెప్పించారు.. అప్పట్లోనే దాని ధర రూ.400 డాలర్లు.
నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ చేసిన ఒక సింపుల్ ప్రయోగం భారీ సక్సెస్ అయ్యింది.