ప్రజాభవన్‌కు విజ్ఞప్తులతో జనం పోటెత్తుతున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజాభవన్‌కు వచ్చే అవసరం లేకుండా ముందుగానే గ్రామాలు, పట్టణాల్లోనే సమస్యలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. నెలలో రెండు రోజుల పాటు పట్టణ, గ్రామ సభలు నిర్వహించి ప్రజలు సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. స్థానికంగానే సమస్యలు పరిష్కారమైతే హైదరాబాద్ వరకు వచ్చే అవసరం తగ్గుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
నిర్దేశిత గడువులో వేగంగా సమస్యలు పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల ఫిర్యాదులు, వినతులను డిజటలీకరణతో పాటు.. అవి ఏ దశలో ఉన్నాయో ప్రజలకు తెలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజావాణికి అద్భుతమైన స్పందన వస్తున్నందున ఫిర్యాదులు స్వీకరించేందుకు టేబుల్స్ పెంచాలని.. మంచినీరు, ఇతర వసతులకు కల్పించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.