బీఆర్‌ఎస్‌ నేతలతో టచ్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు?

frame బీఆర్‌ఎస్‌ నేతలతో టచ్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు?

Chakravarthi Kalyan
రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు అప్పుడే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయా అంటే అవునంటున్నారు కాంగ్రెస్ నేతలు. మంత్రి పదవి రాని తమ పార్టీ సీనియర్ నేతలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని పీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్షాలు సంయమనం పాటించాలన్న పీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్‌కుమార్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఐదు రోజుల్లోనే మీకు ఓపిక నశించిందా అంటూ ప్రతిపక్షాలనుద్దేశించి ప్రశ్నించారు.

ఐదు రోజుల్లోనే ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తునన్నారని చామల కిరణ్‌కుమార్ రెడ్డి  విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రోజుకు 18గంటలు పనిచేస్తున్నారని చామల కిరణ్‌కుమార్ రెడ్డి వివరించారు. తమది ప్రజా ప్రభుత్వమని ప్రజల కోసం ఏర్పడిందే కాంగ్రెస్ పార్టీగా అన్న చామల కిరణ్‌కుమార్ రెడ్డి.. ప్రతిపక్షం బలంగా ఉంటే ప్రజలకు కూడా న్యాయం జరుగుతుందన్నారు. మరి ఈ వార్తలో ఎంత వరకూ వాస్తవం ఉందో?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు:

Unable to Load More