బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతర గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో వందేమాతరం గేయానికి సంబంధించి చర్చ జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వందేమాతరం గేయాన్ని వక్రీకరించారంటూ కాంగ్రెస్ విమర్శించగా.. జవహర్లాల్ నెహ్రూ సమయంలోనే వందేమాతర గేయం వక్రీకరించబడిందని బీజేపీ అంటుంది. ఇలా పార్లమెంటులో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేలా లెక్కలు మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా బీజేపీకి ఆపోజిట్ లో ఉన్న వైసిపి స్టాండ్ తీసుకుంది. ఈ విషయంలో బీజేపీకి వైయస్ఆర్సీపీ పూర్తి మద్దతుగా నిలిచింది. పార్లమెంట్లో నరేంద్ర మోడీ వందేమాతరం గేయానికి సంబంధించిన స్పీచ్ స్టార్ట్ చేస్తే వైఎస్ఆర్సిపి పార్టీ కూడా బీజేపీని సమర్థించింది. వైయస్ఆర్సీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి వందేమాతర గేయంపై కీలకమైన ఉపన్యాసం ఇచ్చారు.
బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతర గేయం కేవలం పాట కాదు ఇది సామాన్యులని స్వతంత్ర సమరయోధులుగా మలిచిన శక్తి. అది దేశమాత కి ఆత్మ అని అభివర్ణించారు. బడుగు బలహీన వర్గాలు, రైతులు, విద్యార్థుల భవిష్యత్తును కాపాడడమే నిజమైన దేశభక్తి అని పార్లమెంట్లో ఎంపీ గురుమూర్తి గుర్తు చేశారు. ఇక వందేమాతర గేయ గొప్పతనం చెబుతూనే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో జగన్ పాలనలో పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చారని అన్నారు. ఇక వివక్ష లేకుండా అమలు చేసిన ఈ కార్యక్రమంలో వందేమాతరం అర్థాన్ని ప్రతిబింబిస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఆయన స్పీచ్ లో కేవలం వందేమాతరం గురించి కాకుండానే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన కొన్ని అంశాలను కూడా మాట్లాడారు.
విద్య,వైద్యం ప్రైవేటీకరణ..అన్నం పెట్టిన రైతుకి కనీస మద్దతు ధర దక్కడం లేదు. కళాశాలలో, పాఠశాలలో కలుషితమైన ఆహారం తిని చిన్నారులు ఆసుపత్రిపాలవుతున్నారు.దళిత బిడ్డలకు చాలా అన్యాయం జరుగుతుంది అంటూ ఎన్నో విషయాలను ప్రస్తావించారు. అలాగే వందేమాత గేయాన్ని గౌరవించడం అంటే చరిత్రను కీర్తించడం మాత్రమే కాదు నేటి అన్యాయాలను ఎదిరించి భరతమాత బిడ్డలందరికి న్యాయం జరిగేలా చూడడమే వందేమాతరం అనే నినాదంతో వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి పార్లమెంట్లో మాట్లాడారు. అలా ఏపీలో బీజేపీ టిడిపి పార్టీతో పొత్తులో ఉన్నప్పటికీ వందేమాతరం విషయంలో మాత్రం బీజేపీకి వైఎస్ఆర్సిపి పూర్తి మద్దతుని ఇచ్చింది.