కళ్యాణ్ అసలు ఇండియన్ ఆర్మీ కాదు.. అంతా ఫేక్ అంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్ బాగోతం బయట పెట్టిన ఆర్మీ జవాన్.!

Pandrala Sravanthi
ఏంటి ఆర్మీ జవాన్ అని చెప్పుకొని బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ పడాలా అసలు ఆర్మీ నే కాదా.. ఆయన చెప్పినవన్నీ ఫేక్ మాటలేనా.. ఇంతకీ ఆ ఆర్మీ జవాన్ చెప్పిన వీడియోలో ఏముంది అనేది చూద్దాం.. బిగ్ బాస్ సీజన్ 9 లో అగ్నిపరీక్ష ద్వారా కామనర్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఆర్మీ జవాన్ గా వచ్చిన కళ్యాణ్ పడాలా కూడా ఒకరు..ఆయన తన గేమ్ తో భారీ గ్రాఫ్ పెంచుకొని టైటిల్ ఫేవరెట్ గా మారిపోయారు. అంతేకాదు ఈసారి టైటిల్ కొట్టేది కూడా కళ్యాణ్ పడాలానే అని, ఆర్మీ జవాన్ కి టైటిల్ ఇస్తే బిగ్ బాస్ గ్రాఫ్ మరింత పెరుగుతుందనే ఉద్దేశంతో బిగ్ బాస్ యూనిట్ ఈ విధంగా ఆలోచన చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కళ్యాణ్ పడాలా ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేసేలా ఓ ఆర్మీ జవాన్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.ఆ వీడియోలో ఆయన ఏం మాట్లాడారంటే.. కళ్యాణ్ పడాలా అసలు ఇండియన్ ఆర్మీ జవాన్ కాదు.. ఎందుకంటే అతను ఆరు నెలలు మాత్రమే డ్యూటీ చేశారు. 


ఆ తర్వాత అతన్ని డిస్మిస్ చేశారు.ప్రస్తుతం బిగ్బాస్ లో ఉన్నారు. ఆర్మీలో ఎవరికైనా 89 రోజులు మాత్రమే లీవ్ ఉంటుంది. ఆ తర్వాత దాటితే మాత్రం డిస్మిస్ ఫ్రం సర్వీస్ చేస్తారు. ఇక కళ్యాణ్ హౌస్ లోకి వెళ్లి 90 రోజులు అయింది కాబట్టి ఆయన్ని డిస్మిస్ అయినా చేసి ఉండాలి లేకపోతే ముందే జాబ్ కి రిజైన్ చేసి ఉండాలి. ఇక కళ్యాణ్ గురించి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆయన ఇండియన్ ఆర్మీ జవాన్ కాదు సెంట్రల్ రిజర్వ్ పోలీస్(CRP).. అలాగే కళ్యాణ్ మూడేళ్లు సర్వీస్ చేసి వచ్చానని అబద్ధపు మాటలు చెబుతున్నాడు. కళ్యాణ్ 9 నెలల ట్రైనింగ్ చేసి ఐదారు నెలలు డ్యూటీ చేసి రిజైన్ చేసి వచ్చేసాడు. ఇక మరో విషయం ఏమిటంటే.. ఆర్మీ జవాన్ అనేవాడు ఎవరికి పడితే వారికి సెల్యూట్ కొట్టారు. కేవలం తన పై అధికారులకి,అలాగే ఇండియన్ ఫ్లాగ్ కి మాత్రమే సెల్యూట్ కొడతారు.కానీ కళ్యాణ్ మాత్రం నాగార్జునకి, బిగ్ బాస్ కి ఇలా ఎవరికి పడితే వారికి సెల్యూట్ కొట్టేస్తున్నాడు. కళ్యాణ్ ఆర్మీలో ఉపయోగించే 3D అనే పదాన్ని హౌస్ లో ఉపయోగించారు. 


ఇందులో D అంటే డిసిప్లేన్. కానీ కళ్యాణ్ డిసిప్లేన్ ఎక్కడా కనిపించలేదు. ఆర్మీ జవాన్ ఎవరికి పడితే వారికి సెల్యూట్ కొట్టరు.. ఇందులో డిసిప్లేన్ ఎక్కడుంది..అంటూ మండిపడ్డారు.ప్రస్తుతం ఆ ఆర్మీ జవాన్ మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో కొంతమంది కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయనపై మండిపడుతున్నారు. నీకెందుకు అంత కోపం కళ్యాణ్ మీద.. నువ్వు ఆర్మీ లో ఉండి ఫేమస్ అవ్వలేదు కానీ కళ్యాణ్ మాత్రం ఆర్మీ లో నుండి వచ్చి బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయ్యారనే నీకు కుళ్లంతా..నువ్వు సాధించలేనిది ఆయన సాధించారనే కదా నీకు మండుతుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే బిగ్ బాస్ లోకి వచ్చేముందు కళ్యాణ్ తాను ఆర్మీలో జాబ్ చేసి వచ్చానని,కానీ నాకు ఆర్మీ జాబ్ అస్సలు ఇష్టం లేదని,నాన్న బలవంతం వల్లే అటువైపు వెళ్ళానని నాకు యాక్టింగ్ అంటే ఇష్టమని తెలిపారు. ఇక బిగ్ బాస్ అయిపోయాక కూడా ఆయన ఆర్మీ వైపు వెళ్లరని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: