ఏంటి ఆ దుబాయ్ యూట్యూబర్ ని నాగార్జున రీల్ వైఫ్ పెళ్లి చేసుకోబోతోందా? ఇంతకీ నాగార్జున రీల్ వైఫ్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ నటి ఎవరు అనేది చూస్తే..కుబేర సినిమాలో నాగార్జునకి భార్య పాత్రలో నటించిన సీనియర్ నటి సునయన.. సీనియర్ నటి సునయన ఇప్పటి జనరేషన్ కి కూడా సూపరిచితమే.. అయితే గతంలో ఈమె తెలుగులో కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆ సినిమాలేవి ఈమెకు అనుకున్నంత గుర్తింపు తెచ్చిపెట్టకపోవడంతో చివరికి మలయాళ, తమిళ,కన్నడ భాషల్లో కూడా రాణించింది.ఇక తెలుగులో సునయన నటించిన మొదటి మూవీ కుమార్ vs కుమార్.. అలాగే ఒకప్పుడు యూత్ ని ఎంతగానో ఆకట్టుకున్న టెన్త్ క్లాస్ మూవీ లో కూడా ఈమె సెకండ్ హీరోయిన్ గా చేసింది. అలాగే పగలే వెన్నెల, మిస్సింగ్, సంథింగ్ స్పెషల్ వంటి సినిమాలు కూడా చేసింది.
ఇక రీసెంట్ గా ధనుష్ కుబేర మూవీ లో నాగార్జున భార్య పాత్రలో హోమ్లీ బ్యూటి గా నటించింది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు వెబ్ సిరీస్లలో కూడా రాణిస్తుంది.అయితే అలాంటి సునయనా తాజాగా దుబాయ్ యూట్యూబర్ ని పెళ్లి చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ మధ్యకాలంలో సునయన ఎంగేజ్మెంట్ రింగ్స్ చేతి వేళ్లకు ఉన్న ఫోటో ఒకటి షేర్ చేసింది. దాంతో సునయన ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు అందరూ భావించారు. కానీ ఆమె ఎవరిని పెళ్లి చేసుకోబోతుంది అనేది ఎవరికి తెలియలేదు. కానీ తాజాగా మాత్రం దుబాయ్ కి చెందిన యూట్యూబర్,ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి ఖలీద్ అల్ అమేరీని పెళ్లి చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి.
దానికి కారణం దుబాయ్ యూట్యూబర్ ఖాలీద్ తో సునయన సన్నిహితంగా ఉన్న ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టడమే. అంతేకాదు యూట్యూబర్ ఖలీద్ తాజాగా సునయనతో తన రిలేషన్ ని బహిరంగంగా ప్రకటించారు. తాజాగా గా జరిగిన తన బర్త్డే వేడుకలను ఖలీద్ సునయనతో కలిసి జరుపుకున్నారు. అలాగే సునయనా చేతులు పట్టుకొని ఉన్న ఫోటోని ఖలీద్ షేర్ చేయగా.. సునయనా కూడా ఖలీద్ కట్ చేసిన కేక్ కి సంబంధించిన పోస్ట్ పెట్టడంతో వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ నిజమేనని, వీరి ఎంగేజ్మెంట్ గత ఏడాది జరిగిపోయిందని, త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది.మరి సునయన ఈ విషయంలో అధికారిక ప్రకటన ఇస్తుందా.. లేక పెళ్లి చేసుకొని సడన్ సర్ప్రైజ్ చేస్తుందా అనేది చూడాలి.