స్పిరిట్: పోలీస్ స్టేషన్లో సాంగ్.. డైరెక్టర్ వంగా ప్లాన్ మామూలుగా లేదుగా..?
ప్రభాస్ ఎంట్రీ కోసమే ఈ పోలీస్ స్టేషన్ సెటప్ వేసినట్లుగా సమాచారం. ఇందుకోసం ప్రత్యేకించి మరి ఒక సాంగ్ కూడా ఉండబోతోంది. అలాగే పోలీస్ స్టేషన్ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎపిసోడ్ కూడా సినిమాకే హైలైట్ గా ఉండనుంది.. ఈ చిత్రంలో ప్రభాస్ గతంలో ఎన్నడూ చూడని విధంగా ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా విజన్ ప్రకారం ఈ పోలీస్ స్టేషన్ సెట్ విజువల్ కి సంబంధించి అన్ని చాలా రియలిస్టిక్ గానే ఉండేలా చూస్తున్నారు.
ప్రస్తుతం స్పిరిట్ సినిమాకి సంబంధించి ఈ విషయం వైరల్ గా మారడంతో అభిమానులు కూడా ఈ సినిమా కోసం చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ కెరియర్ లోని ఒక బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా సినిమా గా నిలుస్తుందని, పోలీస్ స్టేషన్ సెట్లో జరిగే అల్లకల్లోలం థియేటర్లలో సరికొత్త రికార్డులను తిరగరాస్తుందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ సినిమాలు విషయానికి వస్తే.. వచ్చే ఏడాది రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అలాగే కల్కి 2, సలార్ 2 , ఫౌజీ వంటి చిత్రాలలో నటిస్తున్నారు.