నిర్మల బయటపెట్టిన కేసీఆర్ రహస్యం?
బంగారంలాంటి రాష్ట్రాన్ని అధ్వాన్నంగా తయారు చేశారన్న నిర్మలా సీతారామన్.. రాష్ట్రంలో ఆరు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తీసుకువచ్చిన మతపరమైన రిజర్వేషన్లను తొలగిస్తామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కేసీఆర్ దళితుడిని సీఎం చేస్తానని మోసం చేశారని.. రాజయ్యను ఉప ముఖ్యమంత్రిని చేసి ఆరు నెలల్లోనే ఆ పదవి నుంచి తొలగించారన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత అధ్వాన్నంగా ఉందన్న నిర్మలా సీతారామన్ ఫిల్లర్లు కుంగిపోవడమంటే మామూలు విషయం కాదన్నారు.