అదానీ, అంబానీపై పోరాడితే జైలుకేనా?

Chakravarthi Kalyan
కేంద్రప్రభుత్వ విధానాలను ఎండగడుతూ వ్యాసాలు రాస్తే వారిని భాజపా జైల్లో పెడుతున్నారని గతంలో ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్‌కూడా ఇలాగే చేసిందన్నారు. రెండు పార్టీలు కూడా అంబానీ, ఆదానీలకు సేవచేసే వారు కాబట్టి వారికి వ్యతిరేకంగా పోరాడేవారిని జైల్లో పెడతారని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బీ.వీ. రాఘవులు ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి కీలకమైన పార్లమెంటరీ పద్దతిని మార్చే ప్రయత్నం చేస్తున్నారని, దేశంలో పంచాయతీ నుంచి పార్లమెంటు వరకూ ఒకేరోజు ఎన్నిక జరపాలని, స్థానిక సంస్థలకు, రాష్ర్ట సమస్యలకు విలువలేకుండా కేంద్రం ప్రయత్నిస్తోందని బీ.వీ. రాఘవులు ఆరోపించారు.

ఎన్నికల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సీపీఎం అభ్యర్థి మల్లికార్జున్‌రావు ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అదాని కొన్ని లక్షల కోట్ల రూపాయలు దొంగ సొమ్ముని విదేశాలకు పంపి మళ్లీ దాన్ని  తీసుకువచ్చి తెల్లసొమ్ము చేసుకున్నారని ఆరోపించారు.  పెద్ద పెద్దవాళ్లు ఏం చేసినా వారిపై చర్యలు లేవన్నారు. భాజపాతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమ్మక్కైయ్యారని ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: