తెలంగాణలో ఓటుకు పదివేలు?
ఈ వీధి కుక్కను, ఆ పిచ్చి కుక్కను పొలిమేరలకు తరమాలని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని.. గల్ఫ్ సంక్షేమ నిధి ద్వారా గల్ఫ్ కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని రేవంత్ రెడ్డి అన్నారు.
ఇక్కడి రైతుల గుండెలు ఆగినపుడు కేసీఆర్‌కు ఈ ప్రాంతం గుర్తు రాలేదా అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి.. గజ్వేల్ లో కేసీఆర్, సిద్దిపేటను హరీష్, సిరిసిల్లను కేటీఆర్ ఊడ్చేశిన్రని అన్నారు. అక్కడ దోచుకునేందుకు ఏమీ లేక కేసీఆర్ కన్ను కామారెడ్డిపై పడిందన్న రేవంత్ రెడ్డి.. ముదిరాజులకు సీట్లు ఇవ్వని కేసీఆర్ కు వాళ్ల ఓట్లు కావాలని ఎద్దేవా చేశారు. కామారెడ్డి రైతుల భూములు కాపాడేందుకే నేను ఇక్కడ పోటీకి దిగానన్న రేవంత్ రెడ్డి.. కామారెడ్డి భూములను మింగేందుకు వచ్చిన అనకొండను వేటాడేందుకే ఇక్కడికి వచ్చానన్నారు.