బీసీలు, ముస్లింల మధ్య చిచ్చుపెడుతున్న కాంగ్రెస్‌?

Chakravarthi Kalyan
కాంగ్రెస్‌ బీసీలు, ముస్లింలకు మధ్య గొడవలు పెట్టాలని చూస్తోందా అంటే అవునంటున్నారు కేటీఆర్‌. కాంగ్రెస్‌ మైనారిటీ డిక్లరేషన్‌ లోపభూయిష్టంగా ఉందన్న కేటీఆర్‌.. కాంగ్రెస్‌.. భాజపా స్ఫూర్తితో మైనారిటీ డిక్లరేషన్‌ ఇచ్చినట్టుందన్నారు. మైనారిటీల విషయంలో కాంగ్రెస్, భాజపా ఆలోచనలు ఒకేలా ఉన్నాయని కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ గతంలోనూ ఇలా చాలాసార్లు తప్పుడు వాగ్దానాలు ఇచ్చిందని.. 2004-2014 మధ్య కాంగ్రెస్‌ మైనారిటీలకు ఏం చేసిందని కేటీఆర్‌ ప్రశ్నించారు.

గతంలో పదేళ్లలో కాంగ్రెస్ మైనారిటీల కోసం కేవలం రూ. 930 కోట్లు మాత్రమే ఉందని.. గత పదేళ్లలో భారాస మైనారిటీల కోసం 10 వేల కోట్లు ఖర్చు చేసిందని కేటీఆర్‌ అన్నారు. బీసీల కులగణనలోకి ముస్లింలను చేర్చుతామని కాంగ్రెస్‌ డిక్లరేషన్ చెబుతోందని.. బీసీల కులగణనలోకి ముస్లింలను చేర్చుతామనడం కుట్రగానే భావిస్తున్నామని కేటీఆర్‌ అన్నారు. మరి దీనిపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: