ఏపీలో ప్రతి ఇంటినీ టార్గెట్‌ చేసిన జగన్‌?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలోని ప్రతి ఇంటినీ టార్గెట్ చేశారు. ఒక కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లకు పూర్తిగా నయం అయ్యేంతవరకూ చేదోడుగా నిలవడమే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మొదటి అడుగుగా ప్రతి ఇంటికీ వెళ్లి జల్లెడపడుతూ, అందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ పేషెంట్లను శిబిరానికి తీసుకురావడం, పరీక్షలు నిర్వహించడం, అక్కడ మందులు ఇవ్వడం చేస్తున్నారు.  అర్బన్‌ ఏరియాల్లో 91 శాతం, రూరల్‌ ఏరియాల్లో ఈ కార్యక్రమం 94శాతం స్క్రీనింగ్‌ పూర్తి చేసుకుంది.
ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో 1.44 కోట్ల కుటుంబాల్లోని వారికి స్క్రీనింగ్‌ పూర్తి చేశారు. 6.4 కోట్ల ర్యాపిడ్‌ పరీక్షలు కూడా చేశారు. జగనన్న సురక్ష కార్యక్రమం చివరిదశలో ఉంది. దీని కోసం ఒక యాప్‌ను మనం వాడుతున్నారు. క్యాంపులకు వచ్చే ప్రతి ఒక్కరి వివరాలు తీసుకుంటూ... వారి ఆరోగ్య పరిస్థితులను యాప్ ద్వారా నమోదు చేస్తున్నారు. ఈ సమాచారం ఆధారంగా తదుపరి చికిత్సలు ఎక్కడ చేయించాలనే దానిపై డేటా సేకరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: