వైఎస్‌ని దింపి.. నన్ను సీఎం చేయండి అన్న కేసీఆర్‌?

Chakravarthi Kalyan
వైఎస్ హయాంలో కేసీఆర్ ఢిల్లీ వెళ్లి సీఎం పదవి నుండి వైఎస్ ను తొలగించి తనను సీఎం చేస్తే తెలంగాణ ఉద్యమాన్ని బంద్ చేస్తానని కేసీఆర్ చెప్పారా.. అంటే అవునంటున్నారు బీజేపీ నేత కె. లక్ష్మణ్.. బీఆర్ఎస్ చీటర్స్ పార్టీ.. రాజకీయ పరాన్న జీవుల పార్టీ అంటున్న బీజేపీ నేత కె. లక్ష్మణ్.. నీ స్వార్థం కోసం తెలంగాణ ఉద్యమాన్ని కూడా తాకట్టు పెట్టేందుకు సిద్ధమైంది నిజం కాదా అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన సమయంలో కుటుంబంతో కలిసి సోనియాగాంధీకి దాసోహమై టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానన్నది వాస్తవం కాదా అని బీజేపీ నేత కె. లక్ష్మణ్ ప్రశ్నిస్తున్నారు.

బావ బామ్మర్థుల తీరు సభ్యసమాజం అసహ్యించుకుంటోందని.. వేల కోట్ల అభివ్రుద్ధి పనులను ప్రారంభించడానికి ప్రధాని వస్తే మంత్రి హరీష్ రావు వ్యవహరించిన తీరు హేయనీయమని బీజేపీ నేత కె. లక్ష్మణ్ అన్నారు. 2004లో కాంగ్రెస్ తో, 2009లో మహాకూటమితో, మొన్నటి ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్న మీరా బీజేపీపై విమర్శలు చేసేది అని బీజేపీ నేత కె. లక్ష్మణ్ నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: