జగన్‌ను అప్పుడే టీడీపీ అలా చేసి ఉంటే..?

Chakravarthi Kalyan
శాంతి భద్రతలను కాపాడే పార్టీ  తెలుగుదేశం పార్టీ అని.. అందుకే  చంద్రబాబు అరెస్టుకు శాంతియుతంగానే నిరసన తెలుపుతున్నామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తాము ఇలా కాకుండా వైసీపీ వాళ్ళకిలా ప్రవర్తించి ఉంటే రాష్ట్రంలో పరిస్థితి మరో రకంగా ఉండేదని నారా లోకేష్‌ అన్నారు. ప్రభుత్వ ప్రైవేటు వ్యక్తిగత ఆస్తులకు ఎలాంటి నష్టం జరగకూడదనే చంద్రబాబు భావించారని.. అందుకే శాంతియుతంగా నిరసనలు జరుగుతున్నాయని నారా లోకేష్‌ తెలిపారు.

అరెస్టు చేసిన రోజు చిలకలూరిపేటలో చంద్రబాబు చెప్పబట్టే జనం రోడ్డు పైనుంచి పక్కకు వచ్చారని.. అధికారంలో ఉన్నప్పటి కంటే ప్రతిపక్షం లో ఉన్నప్పుడే  హెరిటేజ్ ఆస్తులు పెరిగాయని.. తాను హెరిటేజ్ లో ఒక షేర్ హోల్డర్ ను మాత్రమేనని నారా లోకేష్‌ అన్నారు. షేర్ హోల్డర్ కు కంపెనీకి ఉన్న ఆస్తులు, అకౌంట్లు, అప్పులు వివరాలన్నీ తెలియవని.. తెలియాలని నిబంధన కూడా లేదని నారా లోకేష్‌ అన్నారు. 4న సిఐడి విచారణకు హాజరు అవుతాను.. వాళ్ళు అడిగిన వివరాలన్నీ ఇస్తానని.. తప్పు చేయనప్పుడు నేను ఎందుకు భయపడాలని నారా లోకేష్‌ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: