AI టెక్నాలజీలో సంచలనం సృష్టించిన భారత్..?

Pulgam Srinivas
AI ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ ప్రపంచాన్ని ప్రస్తుతం ఒక ఊపు ఊపుతున్న విషయం మన అందరికి తెలిసిందే. కొన్ని సంవత్సరాల క్రితం ఎంతో కష్ట పడి ఎన్నో రోజులు , గంటలు కష్ట పడితే జరిగే పనిని AI టెక్నాలజీ అత్యంత సులువుగా నిమిషాలలో పూర్తి చేస్తూ వస్తుంది. దానితో ప్రపంచం మొత్తం ప్రస్తుతం AI టెక్నాలజీ వైపు చూస్తుంది. దానితో AI టెక్నాలజీలో అనేక ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతున్నాయి. ఇక AI టెక్నాలజీ వల్ల పనులు ఎంతో త్వరత పూర్తి అవుతున్న నేపథ్యం లో ప్రపంచం లోని చాలా దేశాలు కూడా AI టెక్నాలజీలో ముందుకు దూసుకుపోవడానికి అత్యంత పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇకపోతే ఇప్పటికే భారత దేశం కూడా AI టెక్నాలజీలో అత్యంత స్పీడుగా ముందుకు దూసుకుపోతుంది. తాజాగా ఓ నివేదిక ప్రకారం AI టెక్నాలజీ వినియోగంలో భారత అద్భుతమైన స్థానంలో కొనసాగుతుంది.


భారత్ గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం నాలుగు స్థానాలు ఏగబాకి అదిరిపోయే రేంజ్ లో స్థానాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తుంది. అసలు విషయం లోకి వెళితే ... తాజాగా ఓ నివేదిక ప్రకారం AI టెక్నాలజీలో అమెరికా మొదటి స్థానంలో కొనసాగుతూ ఉంటే , ఆ తర్వాతి స్థానంలో చైనా కొనసాగుతుంది. ఇక ఆ తర్వాతి స్థానంలో భారత్ స్థానాన్ని సంపాదించుకుంది. ఏకంగా అమెరికా చైనా లాంటి భారీ సంపన్న దేశాల తర్వాతి స్థానాన్ని భారత్ దక్కించుకోవడంతో AI విషయంలో భారత్ అత్యంత ముందు దశలో ఉంది అని మరికొన్ని సంవత్సరాలలో  AI టెక్నాలజీ వినియోగంలో కానీ దాని ద్వారా సదుపాయాలను అందించడంలో కానీ భారత్ అత్యంత మెరుగుపడుతుంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా కూడా AI టెక్నాలజీ సదుపాయాలను అందించడంలో వినియోగించడంలో భారత్ ప్రస్తుతం అద్భుతమైన స్థానంలో కొనసాగుతున్నట్లు ఈ నివేదిక ద్వారా అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: