భూమాఫియాలో తెలంగాణ నెంబర్ వన్?
నిరుద్యోగుల సమస్యలపై తాము చేస్తున్న పోరాటంతోనైనా కేసీఆర్ సర్కార్ నిద్రలేవాలని తరుణ్ చుగ్ అన్నారు. చెవిటి, గుడ్డి ప్రభుత్వం ఇకనైనా మేల్కోవాలన్న తరుణ్ చుగ్.. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారని ఏది కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఈ నవంబర్ తో తెలంగాణకు పట్టిన కేసీఆర్ అనే మకిలి వీడుతుందని తరుణ్ చుగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు పడక గదుల ఇళ్లు, దళిత బంధు ఏది కేసీఆర్ ఎందరికి ఇచ్చారని తరుణ్ చుగ్ ప్రశ్నించారు.