చంద్రబాబు అరెస్ట్.. జగన్ అతి పెద్ద తప్పు చేశాడా?

Chakravarthi Kalyan
చంద్రబాబు అరెస్టుపై ఇప్పుడు జనంలో విపరీతమైన చర్చ జరుగుతోంది. అయితే చంద్రబాబు జోలికి వచ్చి సైకో జగన్ చేసిన అతిపెద్ద తప్పు చేశారని నారా లోకేశ్ మండిపడ్డారు. జగన్‌ రాజకీయంగా, వ్యక్తిగతంగా భారీ మూల్యం చెల్లించబోతున్నారని నారా లోకేశ్‌ హెచ్చరించారు. జగన్‌కు అధికారం అంటే కక్షసాధింపులు, వేధింపులు, దొంగ కేసులు, హింస మాత్రమే అని నారా లోకేశ్‌ విమర్శించారు.

చంద్రబాబు అరెస్టుతో ప్రజల్లో ఎప్పుడూ లేనంత స్పందన వచ్చిందని నారా లోకేశ్‌  అన్నారు. టీడీపీ బంద్‌కు ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మద్దతు తెలిపారని.. బంద్‌ను జయప్రదం చేసిన అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. పాముకు తలలోనే విషం ఉంటే జగన్‌కు ఒళ్లంతా విషమేనని నారా లోకేశ్‌  అన్నారు. చంద్రబాబుకు అవినీతి మరక అంటించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని.. కానీ బాబుపై చేసిన అవినీతి ఆరోపణలను ఎవరూ నమ్మడం లేదని నారా లోకేశ్‌  అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: