చంద్రబాబుకు అల్జీమర్స్.. లోకేశ్‌ సులభ్‌ కాంప్లెక్స్‌?

Chakravarthi Kalyan
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి చంద్రబాబు, లోకేశ్‌పై ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఈ మధ్య క్రర పట్టుకొని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తున్నారని.. ఏదో పెద్ద మేధావిలా ప్రవర్తిస్తున్నాడని... 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ప్రజలకు చేసిందేమీ లేదని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి  అన్నారు. చంద్రబాబు కొత్తగా విజన్‌ 2047 అంటున్నాడని... నీతి ఆయోగ్‌ ప్రవేశపెడితే దాన్ని కాపీ కొట్టి 2047 విజన్‌ అని మాట్లాడుతున్నాడని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి  చెబుతున్నారు.

ప్రస్తుతం చంద్రబాబు వయసు 75 సంవత్సరాలని.. 2047కు 100కు చేరుతాడని... ఇప్పటికే అల్జీమర్స్‌ వ్యాధితో బాధపడుతున్నాడని.. మరో 25 సంవత్సరాలకు ఎలా ఉంటాడో ఊహించుకోవచ్చని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి  అన్నారు. ఇక లోకేశ్‌ ఎవరైతే వైయ‌స్ఆర్ సీపీని సపోర్ట్‌ చేస్తారో.. వారితో పాస్‌ పోయిస్తాను అని లోకేశ్‌ అంటున్నాడని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గుర్తు చేశారు. అసలు కట్‌ డ్రాయర్లపై వీధుల్లో తిప్పే యోచన లోకేశ్‌కు ఎందుకు వస్తోందన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. మాన్యుఫ్యాక్చరింగ్‌ డిఫెక్ట్‌ ఏమైనా ఉందా అని అనుమానం వ్యక్తం చేశారు. అంతగా పాస్ పోయించాలనే కోరిక లోకేశ్‌కు ఉంటే సులభ్‌ కాంప్లెక్స్‌ వ్యాపారం చేసుకోవచ్చని సూచించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: