అక్రమ సంబంధాని అడ్డం.. కూతుర్నే చంపేసింది?

Chakravarthi Kalyan
అక్రమ సంబంధాని అడ్డంగా ఉందని ఓ తల్లి ఏకంగా కూతుర్నే చంపేసింది. సికింద్రాబాద్‌ కుషాయిగూడలో బాలిక అనుమానాస్పద మృతిలో ట్విస్ట్ వెల్లడైంది. కూతురుని తల్లి కళ్యాణి హత్య చేసినట్లుగా తేల్చిన పోలీసులు.. వివాహేతర సంబంధానికి అడ్డం వస్తుందని నాలుగేళ్ల కూతురు తన్వితను హత్య చేసినట్టు గుర్తించారు. కల్యాణి భర్త ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కొన్నాళ్లుగా భర్తతో గొడవలతో దూరంగా అమ్మవారింట్లో ఉంటున్న కళ్యాణి.. స్థానికంగా ఉన్న మరో యువకుడితో కళ్యాణి కి అక్రమ సంబంధం పెట్టుకుంది.

అయితే అందుకు కూతురు అడ్డుగా ఉందని.. ఈనెల 1న కుమార్తెను హత్య చేసింది. దిండుతో హత్య చేసి నిద్రలో చనిపోయినట్లుగా ప్రచారం చేసింది. స్థానికులను సైతం నమ్మించిన కళ్యాణి. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన కుషాయిగూడ పోలీసులు పోలీసులు.. విచారణలో తల్లి కళ్యాణినే హత్య చేసినట్లు గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: