పవన్ ఫ్యామిలీపై కామెంట్లు.. పోలీసులకు ఫిర్యాదు?
వైసిపి నాయకుల కుటుంబాల్లోనూ మహిళలు ఉన్నారనే విషయాన్ని గుర్తించుకోవాలని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పి.శిరీష అన్నారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ తమకు విలువలతో కూడా రాజకీయాలు నేర్పారని.. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే వాటికి సమాధానాలు చెప్పలేని వారే ఇలా చేస్తారని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పి.శిరీష అన్నారు. సాటి మహిళలపై వ్యక్తిగత విమర్శలు చేస్తుంటే మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు.