సంతానం కలగని దంపతులకు ఓ గుడ్‌న్యూస్‌?

Chakravarthi Kalyan
మహిళల్లో సంతాన లేమి సమస్యలకు సంబంధించి అద్భుత పురోగతిగా ఓవాపెక్స్ మాత్రలు మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్నామని అపెక్స్ లాబొరేటరీస్ హెర్బల్ డివిజన్ గ్రీన్ మిల్క్ కాన్సెప్ట్స్ వెల్లడించింది. హైదరాబాద్ అమీర్‌పేట హోటల్ ఆదిత్య పార్కులో జరిగిన కార్యక్రమంలో ఓవాపెక్స్ మాత్రలు విడుదల చేశారు. ఓవాపెక్స్ అనేది పీసీఓఎస్‌, వంధ్యత్వంతో బాధపడుతున్న స్త్రీలల్లో వ్యాధి భారం తగ్గించేందుకు ప్రత్యేకంగా రూపొందించారు.
పీసీఓఎస్‌ అనేది సంక్లిష్టమైన హార్మోన్ల రుగ్మత, లక్షలాది మంది స్త్రీలను ఇది ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలంగా వేధించే బుతు క్రమం అనేది సక్రమంగా లేకపోవడం, సంతాన లేమి సమస్య, బరువు పెరగడం, మొటిమలు, జట్టు అధికంగా పెరుగుదల వంటి వ్యాధి లక్షణాలకు దారితీస్తుంది. పీసీఓఎస్‌ వంధ్యత్వానికి సంబంధించి అంతర్లీన హార్మోన్ల అసమతుల్యతలు పరిష్కరించడం కోసం శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు విస్తృత పరిశోధనలు, అధ్యయనాల నేపథ్యంలో ప్రత్యేకంగా ఎంచుకున్న శక్తివంతమైన ఆయుర్వేద పదార్ధాలు మిళితం చేసి ఈ  ప్రత్యేకమైన ఫార్ములా రూపొందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: