పవన్.. చెప్పులు వదిలేయ్.. గ్లాసు పగిలింది చూస్కో?
పవన్ వ్యాఖ్యలకు మంత్రి పేర్ని నాని ఇలా వెరైటీగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంత్రి పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే.. అక్టోబర్ 18న వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్తే ఎవడో నా ఒక చెప్పు కొట్టేశాడన్నారు. ఎదురుగా పవన్ ఆఫీస్ ఉందని అనుమానించలేం కదా అని మంత్రి పేర్ని నాని అన్నారు. నా ఒక చెప్పు పోయి 9 నెలలు అవుతోందని... ఆ ఒక చెప్పు పట్టుకెళ్లినోడు దాంతో ఏం చేసుకుంటాడోనని సెటైర్ వేసారు. చెప్పులు పోయి మూడ్రోజులకే పవన్ కంగారు పడుతున్నాడని.. చెప్పులు పొతే ఎవరో ఒక ప్రొడ్యూసర్ కొనస్తాడని... కానీ జనసేన పార్టీ గాజు గ్లాస్ సింబల్ పోయింది అది చూస్కో అంటూ మంత్రి పేర్ని నాని సెటైర్ వేశారు.