పవన్‌ కల్యాణ్‌ లీడర్ కాదు.. బ్రోకర్‌?

Chakravarthi Kalyan
పవన్‌ కల్యాణ్‌ లీడర్ కాదు.. బ్రోకర్‌ అంటూ విరుచుకుపడ్డారు కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి.. పవన్‌ కల్యాణ్‌కు రాజకీయాలపై ఏమాత్రం అవగాహన లేదన్నారు. పవన్‌ కల్యాణ్‌ కేవలం బీజేపీ-టీడీపీకి మధ్య బ్రోకర్‌గా పని చేస్తున్నాడని ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. పవన్ కల్యాణ్‌ పార్టీకి అతీగతీ లేదన్న ఎస్వీ మోహన్ రెడ్డి.. అసలు పోటీ చేసేందుకు గుర్తు కూడా లేదని ఎద్దేవా చేశారు.


రాష్ట్రంలో అవినీతి ఆరోపణలు లేకుండా జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారని.. అందుకే  చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, పవన్ కల్యాణ్‌ చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మే పరిస్థితి‌‌ లేదని ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. బీజేపీకి ఏపీలో ఉనికే లేదని... తమకు ఉనికి ఉందంటూ చాటుకునే ప్రయత్నంలో భాగంగానే ఆ పార్టీ నేతలు జగన్‌ను విమర్శిస్తున్నార‌ని ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: