జగన్‌పై పోరాటం.. ఆగదంటున్నారు?

Chakravarthi Kalyan
పాత పెన్షన్‌ విధానం తెచ్చే వరకూ జగన్ సర్కారుపై పోరాటం ఆగదని ఏపీ సచివాలయ సీపీఎస్ అసోసియేషన్ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన గ్యారెంటీడ్ పెన్షన్ పథకం గతంలో ఎస్ పి టక్కర్ కమిటీ ప్రతిపాదనకు దగ్గరగానే ఉందన్న నేతలు.. ప్రతిపక్షనేతగా జగన్ సీపీఎస్ రద్దుకు హామీ ఇవ్వడంతోనే టక్కర్ కమిటీ ప్రతిపాదనలను ఉద్యోగ సంఘాలు తిరస్కరించాయని గుర్తు చేశారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించిన ఈ జీపీఎస్ మార్గదర్శకాలు ఏమిటో తక్షణం వెల్లడించాలన్న నేతలు.. గ్యారెంటీడ్ పెన్షన్ పథకం మార్గదర్శకాలు తెలియకపోవటం వల్ల ఇది ఎంతవరకూ అమోదయోగ్యమో చెప్పలేమన్నారు.

ఈ విధానంలో పెన్షనర్లకు పీఆర్సీ వర్తించకపోవటం, కమ్యుటేషన్, అదనపు క్యాంటం పెన్షన్ లాంటి ప్రయోజనాలు లేవని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. అందుకే ఉద్యోగుల సామాజిక ఆర్ధిక భద్రత ఇచ్చే పాతపెన్షన్ విధానమే శ్రేయస్కరం అని భావిస్తున్నామని.. రాజస్థాన్, చత్తీస్ ఘడ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ , పంజాబ్ రాష్ట్రాలు సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: