అమరావతి రాజధానిలో పేదలు ఉండొద్దా?

Chakravarthi Kalyan
పేదలకు ఇచ్చే సెంటు స్థలాన్ని చంద్రబాబు సమాధులతో పోల్చడాన్ని మంత్రి రోజా తప్పుబట్టారు. పేదలకు పట్టాల పంపిణీపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికాదని మంత్రి రోజా మండిపడ్డారు. పేదల ఇళ్లను సమాధులని సంబోధించడం దుర్మార్గమన్న మంత్రి రోజా.. రాజధానిలో వుండటానికి పేదలు పనికిరారా అన్నారు. వారు కేవలం ఓట్లు వేయడానికి మాత్రమే పనికి వస్తారా అంటూ మంత్రి రోజా ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికల్లో జనం టీడీపీని రాజకీయంగా పాతరేస్తారని మంత్రి రోజా చెప్పారు. ఆర్ 5 జోన్‌లో ఇళ్ల పట్టాలకు సంబంధించిన సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్ట్ కూడా  సమర్ధించిందని మంత్రి రోజా అంటున్నారు. పట్టాలు ఇవ్వడమే కాకుండా 30 లక్షల మందికితాము ఇళ్లను కూడా నిర్మించి ఇస్తున్నామని మంత్రి రోజా చెప్పారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా వుండి.. ఒక్క సెంటు భూమిని కూడా పేదలకు ఇవ్వలేదని మంత్రి రోజా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: