ఇవాళే ఇంటర్‌ ఫలితాలు.. విద్యార్థులు జాగ్రత్త?

Chakravarthi Kalyan
ఇంటర్మీడియట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఈ ఉదయం 11 గంటలకు ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించనున్నారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన ఇంటర్ పరీక్షలకు సుమారు తొమ్మిదిన్నర లక్షల మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. మొదటి సంవత్సరం 4 లక్షల 82 వేల 677 మంది.. రెండో సంవత్సరం 4 లక్షల 65 వేల 22 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని తెలిపారు.

మూల్యాంకన ప్రక్రియ సుమారు ఇరవై రోజుల క్రితమే పూర్తయిందని.. మార్కుల అప్‌లోడ్‌ వంటి ప్రక్రియ పూర్తి చేసి..గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మరోసారి ఫలితాలను క్షుణ్ణంగా పరిలించారని తెలిపారు. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష చేసి ఇవాళ ఫలితాలు వెల్లడించాలని నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: