జూ. ఎన్టీఆర్‌కు కేసీఆర్‌ ప్రయారిటీ.. బాలయ్యకు కోపమా?

Chakravarthi Kalyan
ఖమ్మం లాకారం ట్యాంక్ బండ్ పై విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామరావు విగ్రహ ఆవిష్కరణపై తెలంగాణ సర్కారు జూనియర్ ఎన్టీఆర్‌తో చర్చించడం వివాదాస్పదం అవుతోంది. ఎన్టీఆర్‌ విగ్రహం గురించి బాలయ్యతో కాకుండా జూనియర్ ఎన్టీఆర్‌తో చర్చించడం ఏంటన్న వాదన వస్తోంది. ఈ విగ్రహావిష్కరణకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా మే 28న జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ చేయాలని ఇప్పటికే నిర్ణయించారు.

దీనిపై చర్చ కోసం హైదరాబాద్ లో మంత్రి పువ్వాడ అజయ్ జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారు. జూబ్లీహిల్స్ లోని తారక్ నివాసానికి వెళ్లి విగ్రహ ఆవిష్కరణకు లాంఛనంగా పువ్వాడ ఆహ్వానించారు. ఆవిష్కరణకు సంబంధించి ఇద్దరూ చర్చించారు. శ్రీకృష్ణుడి అవతారంలో 54 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహాన్ని తయారు చేశారు. ఇందుకు సమారు రెండు కోట్ల రూపాయలకుపైగా ఖర్చయింది. మంత్రి పువ్వాడ అజయ్ చొరవతో తానా సభ్యులు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలు, ప్రవాస భారతీయులు ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు సహకరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: