హైదరాబాద్‌లో జీ 20 మీటింగ్‌ సక్సస్‌?

Chakravarthi Kalyan
హైదరాబాద్‌ వేదికగా మూడు రోజుల పాటు జరిగిన రెండో జి 20 సదస్సు విజయవంతంగా పూర్తి అయ్యింది. జి20 సభ్య దేశాల నుంచి 81 మంది ప్రతినిధులు మూడు రోజుల పాటు సమావేశాలకు హాజరయ్యారు. 8 అతిథి దేశాల, 5 అంతర్జాతీయ సంస్థలు, ఒక ప్రాంతీయ సంస్థ నుంచి కూడా ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సదస్సులో డిజిటల్‌ స్కిల్లింగ్‌, డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, సైబర్‌ సెక్యురిటీ ఇన్‌ డిజిటల్‌ ఎకానమీ వంటి అంశాలపై చర్చ నిర్వహించారు. వీటిలో వివిధ దేశాల నిపుణులు పాల్గొన్నారు. చర్చ గోష్ఠిలతో పాటుగా మ్యూచువల్‌ రికగ్నీషన్‌ ఫ్రేమ్‌వర్క్‌ ఆన్‌ డిజిటల్‌ స్కిల్స్‌ అన్న అంశంపై వర్క్‌షాప్‌ను కూడా నిర్వహించారు. భారతీయ సాంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేట్టుగా ఆఖరి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. రెండో సదస్సులో భాగంగా ద్వైపాక్షిక, బహుళ-పార్శ్వ సమావేశాలు కూడా నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

g20

సంబంధిత వార్తలు: