కేసీఆర్‌.. విశాఖ స్టీల్‌ తర్వాత.. ముందు ఇక్కడి సంగతి చూడు?

Chakravarthi Kalyan
కేటీఆర్ అహంకార పూరిత వ్యాఖ్యలు అధికారమదంతో చేసినట్లు స్పష్టమవుతున్నాయని బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్ అంటున్నారు. నేను పక్కా లోకల్ కేజీ నుంచి పిహెచ్డీ వరకు తెలంగాణలోనే చదువుకున్నానని.. బయ్యారం ఉక్కు కర్మాగారంపై ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని.. తెలంగాణను ఉద్దరించమంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ టెండర్లలో పాల్గొంటారంటా అని బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్ ఎద్దేవా చేశారు.

నిజాం షుగర్ ఫ్యాక్టరీనీ వంద రోజుల్లో తెరిపిస్తామన్నారు ఏమైందని.. తెలంగాణలో మూత పడిన కంపెనీలు ఎన్నో ఉన్నాయని.. ఆల్విన్ కోసం ఊసే లేదని.. హెచ్ఎంటీ, అజాంజాహి మిల్స్, రేయన్స్, ప్రాగా టూల్స్ , డిబిఅర్ మిల్స్ ఏమైందని.. బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్  ప్రశ్నించారు. హెచ్ఎంటీ భూముల మీద కన్నేసిన అధికార నాయకులు.. ఐడిపీఎల్ భూములు గద్దల్లా తన్నుకోపోతుంటే ఊసు లేదని.. బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్  విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: