తెలంగాణ రాష్ట్రంలో 30లక్షల మంది నిరుద్యోగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని పేపర్ లీక్‌పై ఏర్పాటైన కాంగ్రెస్ ఉద్యమ కార్యాచరణ కమిటీ ఆరోపించింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లీక్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా పని చేస్తుందని ఛైర్మన్ మల్లు రవి విమర్శించారు. సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారంపై తెలంగాణ సమాజం చాలా ఆందోళనలో ఉందని ఛైర్మన్ మల్లు రవి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఇప్పటికే పోరాటాన్ని ఉదృతం చేసినట్లు చెబుతున్న మల్లు రవి మరింత ఉదృతం చేసేందుకు ఉద్యమ కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేశామన్నారు.
ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంపై రాజీలేని పోరాటం చేయాలని నిర్ణయించినట్లు ఛైర్మన్ మల్లు రవి తెలిపారు. సిట్ విచారణ జరగక ముందే పేపర్ లీక్ వ్యవహారాన్నికేటీఆర్ ఇద్దరికే పరిమితం చేయాలని చూశారని ఛైర్మన్ మల్లు రవి ఆరోపించారు. ఇప్పుడున్న టిఎస్‌పీఎస్‌సి కమిటీని రద్దు చేసి కొత్త కమిటీ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించాలని ఛైర్మన్ మల్లు రవి డిమాండ్ చేశారు.