కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ అంటున్నారు. నిజాం వ్యతిరేఖ, హైదరీబాద్ విలీన పోరాటంలో పాల్గొన్నఅమరవీరులను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందంటూ చరిత్ర వక్రీకరించారని జి.నిరంజన్ ఆరోపించారు. హోంమంత్రిగా ఉండి నిన్న కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా గోరట్ గ్రామం అమరవీరుల స్పూపాన్ని, సర్దార్ విగ్రహాన్ని అవిష్కరించిన సందర్భంగా అమిత్ షా అవాస్తవాలు మాట్లాడారని జి.నిరంజన్ విమర్శించారు.
అందుకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని జి.నిరంజన్ డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ సర్దార్ పటేల్ రోడ్డు, కోటిలో తుర్రేబాజ్ ఖాన్ రోడ్, చప్పల్ బజార్లో షోయెబుల్లా ఖాన్ రోడ్ అని పేర్లు పెంట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని జి.నిరంజన్ ప్రశ్నించారు. విలీనం కోసం పోరాడిన స్వామి రామానంద తీర్థ విగ్రహాన్ని అసెంబ్లీ ఎదుట పెట్టింది...కాంగ్రెస్ కాదా అని జి.నిరంజన్ నిలదీశారు.