శంషాబాద్‌ మెట్రోకు సవాల్‌గా మారిన మైండ్‌స్పేస్‌ జంక్షన్‌?

Chakravarthi Kalyan
శంషాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో రూట్ మ్యాప్ ను పరిశీలించిన మెట్రో ఇంజినీరింగ్ అధికారులకు మైండ్‌ స్పేస్ జంక్షన్‌ ఓ సవాలుగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు మెట్రో  ఇంజనీరింగ్ అడ్వైజర్,  రైల్వే బోర్డు మాజీ మెంబర్ తెలిపారు. ఇంజినీరింగ్ పరంగా రాయదుర్గం స్టేషన్ నుండి నానక్‌రామ్‌గూడ జంక్షన్ వరకు అతి క్లిష్టమైన భాగం అంటున్న మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి.. ఇక్కడి సాంకేతిక సవాళ్లను...ఉత్తమమైన ఇంజనీరింగ్ పరిష్కారాలను సూచించేందుకు తనిఖీలు చేశామన్నారు.

21 మీటర్ల ఎత్తులో మైండ్‌స్పేస్ జంక్షన్‌ను దాటడం ఒక పెద్ద సవాలు అంటున్న ఎన్వీఎస్ రెడ్డి.. మైండ్ స్పేస్ జంక్షన్ లో కింద అండర్‌పాస్, మధ్యలో రోటరీ, పైన ఫ్లైఓవర్ ఒకదాని మీద ఒకటి ఉన్నాయని తెలిపారు. ఈ అడ్డంకిని దాటేందుకు ప్రత్యేక స్పాన్‌ని అక్కడికక్కడే నిర్మాణం విధానంలో పరిశీలించాలని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఎయిర్‌పోర్ట్ మెట్రో పిల్లర్‌లను ఫ్లైఓవర్ పిల్లర్‌లకు దూరంగా ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: