పాకిస్తాన్‌ కు బిగ్ షాక్.. ఇక కొంప కొల్లేరే?

Chakravarthi Kalyan
పాకిస్తాన్‌కు మరో బ్యాడ్ న్యూస్.. ఆ దేశ రేటింగ్‌ను ఫిచ్‌ సంస్థ తగ్గించింది. పాక్‌లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు తక్కువగా ఉన్నాయని భావిస్తున్నామంటున్న ఫిచ్ సంస్థ.. పాక్ ప్రభుత్వం ఇటీవల తీసుకొన్న కొన్ని చర్యల వల్ల ఒక మోస్తరుగా కోలుకోవచ్చని భావిస్తోంది. అయితే పాక్‌లో అకాల వర్షాలు, ఎండలు, ఉగ్రదాడులతో అస్థిరత కొనసాగుతోందని ఫిచ్‌ తెలిపింది. పాకిస్థాన్‌ అమలు చేస్తున్న సంస్కరణల వల్ల.... ఈ ఆర్థిక ఏడాదిలో వివిధ అంతర్జాతీయ సంస్థల నుంచి... 3.5 బిలియన్ డాలర్ల నిధులు వస్తాయని ఫించ్ అంచనా వేస్తోంది.

ఆ సాయం వచ్చినా వివిధ దేశాలకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో పాకిస్థాన్ చెల్లించాల్సిన రుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో గత అక్టోబరులోనే.. పాకిస్థాన్ రేటింగ్‌ను B నుంచి CCC+కి ఫిచ్ సంస్థ తగ్గించింది. ఇక ఇప్పుడు అదే ఫిచ్‌ మళ్లీ పాక్ రేటింగ్‌ను CCCమైనస్‌కు తగ్గించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: