ఆ కర్ణాటక స్వామీజీ అడిగారు.. జగన్‌ ఓకే అన్నారు?

Chakravarthi Kalyan
తిరుమలలో కనకదాసు గురుపీఠం మఠం నిర్మించేందుకు అవసరమైన ఒక ఎకరా భూమిని కేటాయించాలనికర్ణాటక కాగినెలె కనకదాసు గురుపీఠ పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ నిరంజనానందపురి మహాస్వామి సీఎం జగన్‌ను కోరారు. ఆయన విన్నపానికి సీఎం జగన్ కూడా సానుకూలంగా స్పందించారు . తాడేపల్లి లోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో పీఠాధిపతి సహా కర్ణాటక పురపాలక శాఖ మంత్రి ఎం.టి.బి.నాగరాజు సీఎం జగన్‌ను కలిశారు.

మాజీ మంత్రి హెచ్‌.ఎం.రేవణ్ణ, కర్ణాటక వెనుకబడిన కులాల ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ బి.కే.రవి రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషా శ్రీ చరణ్, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తిరుమలలో తమ కురబ సామాజిక వర్గానికి ఇప్పటి వరకు మఠం లేదని, లక్షలాదిమంది స్వామి వారి భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారని.. శ్రీ నిరంజనానందపురి మహాస్వామి సీఎం జగన్‌కు వివరించారు. అంతేకాక శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కీర్తనలు, ప్రశస్ధ్యానికి తమ పీఠానికి ఉన్న చరిత్రను ముఖ్యమంత్రితో  మహాస్వామి పంచుకున్నారని తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: