జగన్‌ను తిట్టిన కానిస్టేబుల్‌కు బిగ్ షాక్‌?

Chakravarthi Kalyan
ఏపీ ముఖమంత్రి గారి పై అనుచిత వాఖ్యలు చేసిన ఏ ఆర్ కానిస్టేబుల్ పై కేసు నమోదు మరియు క్రమశిక్షణ చర్యలకు ఎన్.టి.ఆర్.జిల్లా నగర  పోలీస్ కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటా ఆదేశించారు. ది.01.02.2023 వ తేదిన రాత్రి సుమారు 01.30 hrs, చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిదిలోని గౌరవరం గ్రామం, హెచ్.పి పెట్రోల్ బంక్ సమీపంలో హైవే మొబైల్ వెహికల్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న  సమయంలో  ఆర్మేడ్ రిజర్వు కానిస్టేబుల్ 2587 తన్నేరు వెంకటేశ్వర్లు, గౌరవరం గ్రామానికి చెందిన  ఒక వ్యక్తితో మాటల సందర్భంలో  కానిస్టేబుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, కుటుంబ సభ్యుల పైన అనుచిత వాఖ్యలు చేస్తూ అసభ్యకర పదజాలంతో మాట్లాడాడు. 

కొన్ని  వర్గాల మధ్య విద్వేషాలు రగిల్చే విధంగా మాట్లాడినాడు. సదరు వ్యక్తి ఆ దుర్భాషలను తన సెల్ ఫోన్ లో  చిత్రీకరించాడు. ఒక భాద్యత గల ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి రెండు రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడటం చట్టప్రకారం నేరం కాబట్టి దీనిపై వీడియో తీసిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై చిలకల్లు పోలీసులు కేసు నమోదు చేసినారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: