తెలంగాణకు గుడ్ న్యూస్.. ఆ అనుమతులు వచ్చేశాయ్?
ఛనాకా - కొరాటా ఆనకట్ట ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 13వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. ఆనకట్ట నుంచి లోయర్ పెన్ గంగ కాల్వలకు మరో 47వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. మొత్తంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, తాంసీ, బేలా మండలాల్లోని యాభై వేల ఎకరాలకు పైగా సాగునీరు ఈ ప్రాజెక్టు ద్వారా అందనుంది. తెలంగాణ రాష్ట్రం వైపు ఆనకట్ట నిర్మాణానికి సంబంధించిన పనులకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అనుమతులు ఇచ్చింది.